లోకేష్‌కు వినతిపత్రం ఇస్తున్న ఎపిడబ్ల్యుజెఎఫ్ నాయకులు
ప్రజాశక్తి - ఆదోని
రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న హెల్త్ కార్డు, అక్రిడిటేషన్ల మంజూరు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఎపిడబ్ల్యుజెఎఫ్ నాయకులు కోరారు. శుక్రవారం ఆదోనిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. టిడిపి హయాంలో జర్నలిస్టుల సంక్షేమానికి పాటు పడ్డామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫెడరేషన్ ప్రెసిడెంట్ బసవరాజు, జనరల్ సెక్రటరీ మునెప్ప, ఉపాధ్యక్షులు విజరు, మల్లికార్జున, షంషీర్ ఖాన్, పురుషోత్తం, సుధాకర్, రమేష్ రెడ్డి, ట్రెజరర్ సుధాకర్ ఉన్నారు.










