Oct 23,2023 00:17

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపు ఇచ్చారు. ఎపి వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (ఎపిడిబ్ల్యుజెఎఫ్‌) కాకినాడ జిల్లా మొదటి మహాసభ ఆదివారం స్థానిక రంగరాయ మెడికల్‌ కళాశాల ఆడిటోరియంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.నవీన్‌ రాజ్‌ అధ్యక్షతన నిర్వహిరచారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ, రూరల్‌ ఎంఎలఎలు ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, కురసాల కన్నబాబు హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ప ేస్తున్న జర్నలిస్టులు నేటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారన్నారు. సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, బీమా సౌకర్యం కల్పించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ విధి నిర్వహణలో జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి వార్తలను కవరేజ్‌ చేస్తున్నారన్నారని, ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పెన్షన్‌ సౌకర్యం కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ, కూడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, జనసేన నాయకులు తంగెళ్ల ఉదరు శ్రీనివాస్‌, చిక్కాల దొరబాబు, ఎన్‌జిఒ సంఘం అధ్యక్షుడు రామ్మోహన్‌, కార్యదర్శి వేపకాయల వెంకటకృష్ణ, చేయూత స్వచ్చంద సేవా సంస్థ నాయకులు ఎం.రవికుమార్‌, గోకాడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
ఎపిడిబ్ల్యుజెఎఫ్‌ కాకినాడ జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా వాతాడ నవీన్‌ రాజ్‌, ముమ్మిడి లక్ష్మణ్‌, ఉపాధ్యక్షునిగా నాయుడు, జి.శోభన్‌బాబు, ఆనంద్‌, ఎంవి.రమణ, బోట్ల లోవరాజు, బిందాన సురేష్‌, వీధి గోపీనాథ్‌, సహాయ కార్య దర్శులుగా సురేంద్ర, అలమండ ప్రసాద్‌, ఎస్‌.మదన్‌, కె.సత్య, రామకృష్ణ, గుత్తుల మల్లేశ్వరరావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా బాబి, మీడియా సెక్రెటరీగా పుర్రె త్రినాథ్‌, లీగల్‌ అడ్వైజర్‌గా పథ్వీరాజ్‌, సభ్యులుగా అశోక్‌, కొత్తపల్లి రాంబాబు, వి.స్టాలిన్‌, నానాజీ, బత్తిన తాతాజీ, హసేన్‌, మదన్‌, ఏప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.