Nov 16,2023 23:54

'జర్నలిజం-జర్నలిస్టులు' పుస్తకావిష్కరణ

మంగళగిరి: సమాజాన్ని మార్చగలిగే శక్తి జర్నలిజానికి ఉందని పలువురు వక్తలు అన్నారు. మంగళగిరి ప్రెస్‌ క్లబ్‌ లో గురువారం 'జర్నలిజం-జర్నలిస్టులు' అనే పరిశోధనాత్మక కథనాలు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. పుస్తకాన్ని సీనియర్‌ జర్నలిస్టు ఈపూరి రాజారత్నం రచించారు. ఈ సందర్భంగా శాసనమండలి ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేది జర్నలిస్టులేనని అన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదు ర్కొంటున్నప్పటికీ వత్తి ధర్మాన్ని పాటిస్తూ సమా జానికి ఎంతో మేలు చేస్తున్నారని చెప్పారు. ఏఎన్యూ హెచ్‌ ఓ డి జి అనిత మాట్లాడుతూ జర్నలిజంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఏ వేతనాలు లేకుండా సమాజం కోసం కృషిి చేసేవారు జర్నలిస్టులేనని కొనియాడారు. కార్య క్రమంలో ఆప్కో చైర్మన్‌ గంజి చిరంజీవి, సీనియర్‌ జర్నలిస్టు కె.ముక్కంటి, కె.రూపస్‌, ఎం. సిరిబాబు, ప్రెస్‌ క్లబ్‌ ప్రధాన కార్యదర్శి బి.దయాకర్‌, వి.వాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు సీనియర్‌ జర్నలిస్టులను సత్కరించారు.