టోక్యో : మేఘాలలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ అధ్యయనాన్ని ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ లెటర్స్ జర్నల్ తాజాగా ప్రచురించింది. ఇవి వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది ఇంకా నిర్ధారణ కాలేదు. మైక్రోప్లాస్టిక్‌లు, పారిశ్రామిక మురుగునీరు, సింథటిక్ కార్ టైర్లు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఇతర వనరుల నుండి వచ్చే ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ కణాలను తాము కనుగొన్నట్టు వాసేడా యూనివర్సిటీలోని హిరోషి ఒకోచి సారథ్యంలోని పరిశోధకుల బృందం తెలిపింది. ఈ అధ్యయనంలో పొగమంచు నుండి నీటిని సేకరించింది. క్లౌడ్‌లోని మైక్రోప్లాస్టిక్‌లలో 7.1 నుండి 94.6 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉన్న తొమ్మిది రకాల పాలిమర్‌లు, ఒక రకమైన రబ్బరును బఅందం కనుగొంది.