Oct 29,2023 21:18

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ : ఉత్తమ సామాజిక సేవకు గాను అబ్దుల్‌ కలాం ఎక్స్లెన్సీ పీస్‌ నేషనల్‌ అవార్డును సపోర్ట్‌ సంస్థ ప్రెసిడెంట్‌ జోసఫ్‌ రాజు అందుకున్నారు. ఏషియా ఇంటర్నేషనల్‌ కల్చరల్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పాండిచ్చేరి నగరంలో సన్‌బాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సపోర్ట్‌ సంస్థ అధ్యక్షులు పి.జోసఫ్‌ రాజు 2023 అబ్దుల్‌ కలాం ఎక్స్లెన్సీ పీస్‌ నేషనల్‌ అవార్డు అందుకున్నారు. ఈసందర్భంగా జోసెఫ్‌ రాజ్‌ మాట్లాడుతూ ఏసియా ఇంటర్నేషనల్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ వారు తాను చేస్తున్న సేవలను గుర్తించి నేషనల్‌ పురస్కారం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ సంస్థ ద్వారా నిరాశ్రయులకు, అభాగ్యులకు, క్యాన్సర్‌ బాధితులకు ఆర్థిక సహాయం అందజేయడం, చదువు లేని పెద్దలకు అక్షరతా కార్యక్రమాలు నిర్వహించడం, నిరాశ్రయులకు వైద్యశిబిరాలు నిర్వహించటం వీటితోపాటు పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలలో చైతన్యం తేవడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సేవలను గుర్తించి నేషనల్‌ అబ్దుల్‌ కలాం ఎక్స్లెన్సీ పీస్‌ అవార్డుకు ఎంపిక చేయటం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో జోసెఫ్‌ రాజును సత్కారంతోపాటు మెడల్‌, సర్టిఫికెట్‌ మెమెంటోను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ జె.హరిదాస్‌, రిటైర్డ్‌ జడ్జి ఆంధ్రప్రదేశ్‌ డాక్టర్‌ కాత్రివేల్‌ ఆల్‌ ఇండియా ఈఎంసి ఫౌండేషన్‌, కోయంబత్తూర్‌ డాక్టర్‌ గుణవంత మంజు కన్నడ ఫిలిం డైరెక్టర్‌ భాస్కరన్‌, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ప్రిజం పాండిచ్చేరి సి.రాజేంద్రన్‌, టిబిసి ఇంటర్నేషనల్‌ ఎన్విరాన్మెంటల్‌ యుఎస్‌ఏ శీతల దేవి, ఆలిండియా సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ స్టడీస్‌ చెన్నై బాల కనకనాథన్‌, జనరల్‌ సెక్రెటరీ పాండిచ్చేరి స్టేట్‌ పాల్గొన్నారు.