Apr 16,2023 00:15

గా ప్రచారం చేపట్టారు.


ప్రజాశక్తి - యంత్రాంగం
విశాఖ కలెక్టరేట్‌ : ప్రచార భేరిలో భాగంగా అల్లిపురం సింహాల ద్వారం వద్ద నుంచి సిపిఎం ఆధ్వర్యాన పాదయాత్ర ప్రారంభించారు. పార్టీ సీనియర్‌ నేత వై.రాజు మాట్లాడారు. బిజెపి ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం జగదాంబ జోన్‌ కన్వీనర్‌ ఎం.సుబ్బారావు, సిఐటియు జోన్‌ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, ఆటో కార్మిక సంఘం నాయకులు జి.అప్పలరాజు, డివైఎఫ్‌ఐ నాయకులు సంతోష్‌ పాల్గొన్నారు.
ఆరిలోవ : ఆరిలోవ కాలనీ చివరి బస్టాపు నుంచి ఆపరేషన్‌ కాలనీ, పాండురంగపురం, విష్ణుపురి కాలనీ, దుర్గాబజార్‌ వరకు సిపిఎం, సిపిఐ నాయకులు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీచేశారు. మోదీ హఠావో, దేశ్‌ బచావో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.మణి, సిపిఐ తూర్పు నియోజకవర్గం కార్యదర్శి ఎస్‌కె.రెహ్మాన్‌ మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత మనువాద భావజాలంతో ప్రజల మధ్య చిచ్చుపెడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను బిజెపికి తాకట్టు పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి.నరేంద్రకుమార్‌, పి.శంకరరావు, వి.కృష్ణమూర్తి, ఎస్‌.రంగమ్మ, సిపిఐ నాయకులు ఎ.దేవుడమ్మ, కె.లక్ష్మణరావు, కె.రమణ, కాసుబాబు, పి.శ్రీను పాల్గొన్నారు.
మధురవాడ : జివిఎంసి 5 వార్డు పరిధి నగరంపాలెంలో సిపిఎం, సిపిఐ నాయకులు ప్రచార భేరి నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు, సిపిఎం మధురవాడ జోన్‌ కార్యదర్శి డి.అప్పలరాజు మాట్లాడుతూ, గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం వామపక్ష పార్టీలు పాదయాత్రలు నిర్వహిస్తున్నాయన్నారు. మధురవాడ జాతీయ రహదారి నుంరచి నగరంపాలెం రహదారి ప్రారంభించి ఏళ్ళు గడుస్తున్నా పూర్తి చెయ్యకపోవడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం అన్నారు. స్వతంత్ర నగర్‌, అయోధ్య నగర్‌, ద్రోణంరాజు కల్యాణ మండపం, పాత మధురవాడ తదితర ప్రాంతాల్లో ఉన్న తాగునీటి ట్యాంకులు పాడైపోతున్నాయని ,వీటి స్థానంలో నూతనంగా ట్యాంకులు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ, సిపిఐ సిపిఎం నాయకులు ఎమ్‌డి.బేగం, భారతి, ఎ.గురుమూర్తిరెడ్డి, జి.వేళంగినిరావు, త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : మోదీ విధానాలు అప్రజాస్వామికమని సిపిఎం, సిపిఐ నాయకులు ఎం.రాంబాబు, కసిరెడ్డి సత్యనారాయణ విమర్శించారు. ప్రచార భేరి పాదయాత్రలో భాగంగా శనివారం చైతన్యనగర్‌లో సమావేశం నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ ప్రచార భేరి పాదయాత్రలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో వామ పక్ష పార్టీల నాయకులు అప్పారి విష్ణుమూర్తి, ఎ.లోకేష్‌, జి.ఆనంద్‌, దాసరి అప్పారావు, బెహరా త్రినాథస్వామి తదితరులు పాల్గొన్నారు.
ములగాడ : పారిశ్రామిక ప్రాంతంలోని 59వ వార్డు పరిధి నెహ్రూనగర్‌, హనుమాన్‌నగర్‌, 61వ వార్డు పరిధి మల్కాపురం, 62వ వార్డు పరిధి దుర్గానగర్‌ ప్రాంతాల్లో సిపిఎం, సిపిఐ నాయకులు ప్రచార భేరి పాదయాత్రలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా సిపిఎం మల్కాపురం జోన్‌ కార్యదర్శి పి.పైడిరాజు, సిపిఐ జోన్‌ నాయకులు జి.రాంబాబు మాట్లాడుతూ, దేశానికే అన్నంపెట్టె రైతన్నలను, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి కేంద్ర ప్రభుత్వం నెట్టిందన్నారు. గ్రామీణ పేదల కోసం ఏర్పాటుచేసిన ఉపాధి హామీ చట్టానికి భారీగా నిధులు తగ్గించిందని తెలిపారు. మరో వైపు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశ ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గుడుపుకుంటుందని విమర్శించారు. ఈ పాదయాత్రలో సిపిఎం జోన్‌ నాయకులు ఆర్‌.లక్ష్మణమూర్తి, కె.పెంటారావు, పిసిని రామారావు, ఆర్‌.విమల, ఎన్‌.ఉమ, పి.వరలక్ష్మి, బంగార్రాజు, ఎల్‌.కృష్ణ, బి.అర్జునరావు, జె.రామునాయుడు, బి.శ్రీను, డి.రాజేష్‌, సిపిఐ నాయకులు కె.సత్యాంజనేయులు, బి.అప్పారావు, బి.సత్యానందం తదితరులు పాల్గొన్నారు.
తగరపువలస : జివిఎంసి రెండో వార్డు పరిధి గొల్లవీధి, ఆదర్శనగర్‌ ప్రాంతాల్లో సిపిఎం, సిపిఐ నాయకులు శనివారం ప్రచార భేరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకులు ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి, రవ్వ నరసింగరావు, ఎస్‌.అప్పలనాయుడు, అన్నాబత్తుల నరసింగరావు, ఎం.అప్పలరాజు, ఎన్‌.ఆదినారాయణ, ఎ.గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.
కె.కోటపాడు:కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ సంపదను తన కార్పొరేట్‌ మిత్రులు అదానీ, అంబానీలకు దోచిపెడుతుందని, మోడీ ప్రభుత్వాన్ని సాగనంపడం ద్వారానే దేశ సంపదను రక్షించుకోగలమని సిపిఎం జిల్లా నాయకులు గండి నాయనిబాబు అన్నారు. బిజెపిని గద్దె దింపుదాం... దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో చేపట్టిన ప్రచార భేరి కార్యక్రమం మండలంలోని సూరెడ్డిపాలెం, ఎ.కోడూరు గ్రామాల్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుడూ మోడీ, అమిత్‌షా జోడీ అన్నదమ్ములుగా కలిసి ఉన్న ప్రజల మధ్య మతచిచ్చు పెట్టి విధ్వేషాలు రెచ్చగొడుతూ చీలకలు తెస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎర్ర దేవుడు, వనుం సూర్యనారాయణ, దిక్కుల జోగులు, నారాయణమ్మ, దేవుడమ్మ, సూరి, నాయుడు పాల్గొన్నారు.
పోస్టర్ల ఆవిష్కరణ
రాంబిల్లి : సిపిఎం, సిపిఐ ప్రచార భేరి పోస్టర్లను మండల కేంద్రంలో సిపిఎం నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి.దేముడునాయుడు, లక్ష్మి, వై.రాము. నూకరాజు పాల్గొన్నారు.
పరవాడ : మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ప్రచార భేరి వాల్‌ పోస్టర్‌ను సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం మండలం కన్వీనర్‌ పి.మాణిక్యం మాట్లాడుతూ ఇంటింటి ప్రచారం ద్వారా మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి వారిని చైతన్య పర్చనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గేదెల అప్పారావు, పల్లె అప్పారావు, కొల్లి అప్పారావు, బి శ్రీను పాల్గొన్నారు.
గొలుగొండ:మతోన్మాద దాడులను రెచ్చగొడుతున్న బిజెపిని సాగనంపి దేశాన్ని కాపాడుకుందామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు పిలుపునిచ్చారు. గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామునాయుడు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ అడుగుజాడల్లో నడుస్తున్న బిజెపి ప్రభుత్వం ప్రజల మధ్య మతోన్మాద దాడులను ప్రేరేపించడం, కులాల మధ్య చిచ్చుపెట్టడం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు మేకా సత్యనారాయణ, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎల్‌వి.రమణ, సిపిఐ మండల కార్యదర్శి మేకా భాస్కర్‌రావు, ఏఐవైఎఫ్‌ జి.రాధాకృష్ణ, ఎస్‌.వాసుదేవరావు, పి.సత్తిబాబు, ఎస్‌.బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో సిపిఎం సమావేశం జరిగింది. ప్రచార భేరిని జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్లను ఆవిష్కరించారు. సిపిఎం జిల్లా కమిటీ సబ్యులు డి.సత్తిబాబు మాట్లాడుతూ, బిజేపి అవలంభిస్తోన్న కార్పోరేటు, మతోన్మాద విధానాలపై ప్రజలలో ప్రచారం చేయాలన్నారు. సిపిఎం మండల నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి , జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు, మండల కమీటీ సభ్యులు జి.శివ, రాంబాబు, కన్నబాబు, నాగభూషణం, అప్పారావు, పాండు రాజు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌: స్థానిక శ్రీ కన్య కూడలి వద్ద 'ప్రచార భేరి' గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం జిల్లా నాయకులు మాకిరెడ్డి రామునాయుడు, డి.సత్తిబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, జి.గురుబాబు, శివలంక కొండరావు, ఎ. రాజు, ఎల్‌,గౌరీ, ఎ.ల్‌.వి. రమణ, మేకా సత్యనారాయణ, భవాని, ఎమ్‌.భాస్కరరావు, జి రాధాకష్ణ, నల్లబెల్లి శ్రీరామ్మూర్తి, కెవిఎస్‌ ప్రభ, ప్రసన్న, గీతా కష్ణ , పి బాలరాజు పాల్గొన్నారు