Feb 23,2023 23:58

మురళీనగర్‌లో ప్రచారం చేపడుతున్న రమాప్రభ

ప్రజాశక్తి -యంత్రాంగం
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కోరెడ్ల రమాప్రభ గెలుపును కోరుతూ గురువారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
మాధవధార : మురళీనగర్‌, మాధవధార, కళింగనగర్‌ ప్రాంతాల్లో కోరెడ్ల రమాప్రభ గురువారం ప్రచారం నిర్వహించారు. మురళీనగర్‌లోని వాకర్స్‌ పార్క్‌, బృందావన్‌, ఎమ్మెన్నార్‌ పార్క్‌ ప్రాంతాల్లో వాకర్స్‌ను కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.శ్రీదేవి, బిటి.స్వామి, కె.సుధాకరరావు, ఎస్‌టివి.రమణమూర్తి, పి.రామచంద్రరావు, నాయుడుబాబు, ఈటి రాంబాబు, నాయనబాబు, పాపారావు, ఎస్‌ శ్రావణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
కంచరపాలెం : డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ ఇండిస్ట్రియల్‌ ఎస్టేట్‌లో వాకర్స్‌ను కలిసి తనకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు ఎస్‌.సోమేశ్వరరావు, జి.సూర్యచంద్రరావు, ఎస్‌.అప్పలరాజు, పి.వెంకటరావు, కృష్ణమూర్తి, ఎస్టేట్‌ సిఐటియు ప్రెసిడెంట్‌ ఒ.అప్పారావు, నాయకులు ఎం.ఈశ్వరరావు పాల్గొన్నారు.
తగరపువలస : డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని కోరుతూ స్థానిక సిఐటియు నాయకులు ఎస్‌.అప్పలనాయుడు, డి.బాబాజీ చిట్టివలస ప్రాంతంలో పట్టభద్రులను కలిసి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేశారు.
కె.కోటపాడు:ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పిడిఎఫ్‌, 250 ప్రజా సంఘాలు బలపరిచిన కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గురువారం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఏపీ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయన బాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు వనము సూర్యనారాయణ కె.కోటపాడులో ఎమ్మెల్సీ ఓటు ఉన్న వారి ఇంటికి వెళ్లి రమాప్రభకు ఓటు వేయాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసి, పేదల పక్షాన నిలబడిన రమాప్రభ ఎమ్మెల్సీగా గెలుపొందినట్లయితే అసెంబ్లీలో ప్రజలు గళం వినిపిస్తారని తెలిపారు. విద్యాధికురాలైన డాక్టర్‌ రమాప్రభ సమస్యలపై మంచి అవగాహన ఉందని, అటువంటి వ్యక్తి శాసనమండలికి వెళ్లడం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు.