Sep 28,2023 00:02

జోరు వర్షం.. కూలిన స్లాబులు

జోరు వర్షం.. కూలిన స్లాబులు
ప్రజాశక్తి -నగరి: మండల పరిధిలో మూడు రోజుల పాటుగా కురుస్తున్న జోరువర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు పాత భవనాలకు చెందిన స్లాబులు వర్షపు నీటితో తడిచి కూలి కింద పడుతున్నాయి. బుధవారం పట్టణ పరిధి భేరివీధిలోని ఒక నివాసం ముందున్న స్లాబు, సత్రం దక్షిణపు వీధిలోని ఒక భవనానికి చెందిన స్లాబు అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయానికి కింద ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా స్లాబు పడి పెద్ద శబ్దం రావడంతో ఇరుగు పొరుగు వారు భయాందోళనకు గురయ్యారు.