
* వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం జగన్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: జగనన్న ఆరోగ్య సురక్ష 5వ దశ డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేసి జనవరిలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య సురక్షణ శిబిరాల్లో ఇప్పటి వరకు నాలుగు దశల్లో పట్టణ పరిధిలో 24,892, గ్రామీణ ప్రాంతంలో 2,42,448 ఔట్ పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. కొత్తగా హైపర్ టెన్షన్ 13,997, డయాబెటిస్ (సుగర్) 7,500, టిబి-31, లెప్రసీ 497 కేసులను గుర్తించినట్లు వెల్లడించారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు రిఫరల్ 5,216 మందిని పంపించామన్నారు. వాటిలో కేటరాక్ట్ ఆపరేషన్లకు 2,554, స్పెక్టకల్స్‌కు 2,389 మందిని రిఫరల్‌కు పంపించినట్టు వివరించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.మీనాక్షి, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ పొగిరి ప్రకాశరావు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు, మహిళా శిశు సంక్షేమశాఖ పీడీ శాంతిశ్రీ పాల్గొన్నారు.