Feb 26,2023 19:43

ఆసుపత్రిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆర్థర్‌

జనతా ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రజాశక్తి - నందికొట్కూర్‌

నందికొట్కూరు పట్టణంలో మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో నూతనంగా నిర్మించిన జనతా హాస్పిటల్‌ను ఆదివారం ఎమ్మెల్యే తోగుర్‌ ఆర్థర్‌ ప్రారంభి ంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరికరాలతో అందరికీ అందుబాటులో ఉండేలా వైద్య సదుపాయాలు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందరికీ అందుబాటులో వైద్యం ఉందని పేద ప్రజల కోసం తక్కువ ఖర్చుతోనే వైద్య పరీక్షలన్నీ చేస్తామని చెప్పడం పట్ల నూతన హాస్పిటల్‌ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రబ్బానీ గ్రూప్స్‌ అధినేత తాటిపాడు మాబు సాహెబ్‌, హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జుబేర్‌ అహ్మద్‌, చైర్మన్‌ డాక్టర్‌ జహీరాబాద్‌, నజీర్‌ అహ్మద్‌ సీనియర్‌ అడ్వకేట్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రబ్బాని, కౌన్సిలర్‌ జాకీర్‌ హుస్సేన్‌, బ్రాహ్మణ కొట్టుకూరు సొసైటీ చైర్మన్‌ మద్దూర్‌ హరి సర్వోత్తమ రెడ్డి, దామ గట్ల సర్పంచ్‌ మాధవరం రత్నం, మహిళా నాయకురాలు డాక్టర్‌ వనజ, రిటైర్డ్‌ ఎస్సై పేరుమాల జాను, తమ్మడపల్లి విక్టర్‌, భాస్కర్‌, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.