టిడిపి, జనసేన పొత్తుతో ఇక జగన్ పని అయిపోయిందని రెండు పార్టీల కార్యకర్తలు భావిస్తుం డగా.. కొందరు నాయకుల్లో మాత్రం ఈ పొత్తుపై ఆం దోళన రేకెత్తుతోంది. ఇప్పటి వరకు టిడిపి, జనసేన పార్టీల నుంచి టిక్కెట్ ఆశించిన అభ్యర్థులు పొత్తులో భాగంగా తమకు మొండిచేయి మిగులుతుందని కల వరపడుతున్నారు. రాజోలు నియోజకవర్గంలో రెండు పార్టీల నేతల పాటు కార్యకర్తల్లో సందిగ్ధత నెలకొంది.
ప్రజాశక్తి-రాజోలు
ఎపిలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడు తోంది. గత ఎన్నికల్లో టిడిపి, వైసిపి, జనసేన పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగగా.. ఈసారి మాత్రం టిడిపి, జనసేన పొత్తుతో వారి నుంచి ఒకరు వైసిపి నుంచి ద్విముఖ పోరు జరగనుంది. రాజోలు నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో జనసేన పార్టీ తరఫున టికెట్లు ఆశించేవారి సంఖ్య భారీగానే ఉంది. ఈ జాబితాలో రాజోలు నియోజకవర్గంలో యువ నేత డాక్టర్ రాపాక రమేష్ బాబు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
రేసులో డాక్టర్ బాబు!
రాష్ట్రంలో 2019 ఎక్కడా గెలవని జనసేన పార్టీ కేవలం రా జోలు నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది. గెలిచిన ఒక్క ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు పార్టీని వీడి వైసిపికి సపోర్ట్ చేశారు. దీంతో రాజోలు నియోజకవర్గంలో డాక్టర్ రాపాక రమేష్ బాబు మలికిపురం మండలం చింతలమోరి గ్రామ సర్పంచ్‌గా గెలిచి జనసేన పార్టీ యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. కేవలం పార్టీ రూపొందిం చిన కార్యక్రమాలే కాకుండా తన అనుచరుల సహాయంతో కూడా పలు కార్యక్రమాలు చేపట్టారు. కోవిడ్ సమయంలో తన సొంత ఖర్చులతో తమ సొంత స్వచ్ఛంద సంస్థ ''పింక్ హార్ట్స్ ఫౌండేషన్' ద్వారా కోవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. కోవిడ్ సమయంలో పేదలకు నిత్యావసరాలు అందజేశారు. ఈ సేవలకు ఉమ్మడి గోదావరి జిల్లా ఎస్‌పి ద్వారా ప్రశంసలు, మానవత్వధీర బిరుదు అందుకున్నారు. గత ఏడాదిగా పలు గ్రామాల్లో ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల మన్ననలను పొంది, అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసలు అందుకున్నారు. మొదట్లో తాను ఎంఎల్‌ఎ సీటును ఆశించి ఇదంతా చేయడం లేదని, కేవలం పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో చేస్తు న్నానని డాక్టర్ బాబు చెప్పారు. ఆయన అను చరులు డాక్టర్ ను ఎంఎల్‌ఎగా చూడాలని అనుకుం టున్నారు.
సమస్యలు తెలుసుకుంటోన్న రమేష్ బాబు
డాక్టర్ రమేష్ బాబు ఎంఎల్‌ఎ టిక్కెట్ రేసులో ఉన్నారని, స్థానికుడు కాబట్టి తమ నాయకునికి తప్పకుండా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టికెట్ కేటాయిస్తారని రమేష్ బాబు అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీలో చేరిన నాటి నుంచి తమ నాయకుడు పార్టీలో కొంత మంది యువ కులను సంఘంగా తయారుచేసి పార్టీ ఆధ్వర్యంలో ఓటు సభ్య త్వాలు చేయించారని కార్యకర్తలు గుర్తు చేస్తు న్నారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీని పటిష్ట పరిచే దిశగా జనసేన పోరాట యాత్రలో తమ నాయ కుడు పాల్గొన్నారని.. వారాహి యాత్ర కార్యక్రమాల ను దిగ్విజయంగా చేసి చూపించారని అంటు న్నా రు. తమ నాయకుడుకి జనసేన టిక్కెట్ ఇస్తే గెలిపించి పార్టీకి అంకితం ఇస్తామని కార్యకర్తలు కోరుకుంటున్నారు.
సీటు మాదంటే మాదంటూ ప్రచారం
అధికార పార్టీని ఓడించేందుకు పార్టీల పెద్దలు తీసుకున్న పొత్తు నిర్ణయం మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ రాజోలు నియోజకవర్గంలో మాత్రం టిడిపిలో నిరాశ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిక్కెట్ల సర్దుబాటులో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు టిడిపి పార్టీ శ్రేణులు రాజోలు టిక్కెట్ వదిలే ప్రసక్తి లేదని చెబుతుంటే, ఇటు జనసేన శ్రేణులు రాబోయే ఎన్నికల్లో రాజోలు లో మరోసారి తమ పార్టీ జెండా ఎగరేస్తామని ప్రచారం చేసుకుంటున్నారు.
డాక్టర్ రమేష్ బాబు