Nov 15,2023 19:44

మాట్లాడుతున్న టిడిపి నాయకులు

మాట్లాడుతున్న టిడిపి నాయకులు
జనసేన, టీడీపి నేతల భేటి
-2024లో గెలుపుపై సుదీర్ఘ చర్చ
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:గూడూరు భాస్కర్‌రామిరెడ్డి నగర్‌లోని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డిని మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొంగూరు నారాయణ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 2024లో టీడీపీ - జనసేన కలిసి పని ఎలా చేయాలి...వైసీపీ అరాచక పాలనకి ఎలా స్వస్థి పలకాలన్న దానిపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్ధుల్‌ అజీజ్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నగర అధ్యక్షులు మామిడాల మధు, పలువురు పాల్గొన్నారు.