ప్రజాశక్తి - బాపట్ల
జనసేన, టిడిపి పొత్తు శుభ పరిణామని టిడిపి ఇన్చార్జి వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం టిడిపి, జనసేన కలసి పనిచేస్తామని చెప్పడం మంచి అంశమన్నారు. ఈ పొత్తు రాష్ట్ర ప్రజలను కాపాడటం కోసం, మంచి పాలన అందిచటం కోసం ఏర్పడిందన్నారు. ప్రజలను, రాష్ట్రాన్ని సైకో పాలన నుండి కాపాడడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి రావడం మేలు జరుగుతుందన్నారు.










