
పోస్టర్ ఆవిష్కరిస్తున్న నాయకులు
ప్రజాశక్తి - సైదాపురం : మండల కేంద్రమైన సైదాపురం బస్టాండ్ ఆవరణంలో రోడ్ల అధ్వాన్నస్థితిపై గురువారం జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పరిపాలన విషయంలో ఘోరంగా విఫలమైందన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్న, నేటికీ రోడ్లు మరమ్మతులకు నోచుకోలేదన్నారు. సైదాపురం నుంచి డేగపూడి వరకు రోడ్లు, రెండుడగుల మేర గుంటలు పడి వాహనదారులకు చుక్కలు కనపడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఎపికి జగన్ అవసరం లేదు, పవన్ కళ్యాణ్ అవసరం అనే పోస్టర్‌ను ప్రదర్శించారు.కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు పవన్ ఉన్నారు.