ప్రజాశక్తి-నర్సీపట్నం రూరల్:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు నర్సీపట్నం మున్సిపాలిటీలోని టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు.. పేదల కన్నీళ్లు. కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టిడ్కో ఇళ్ల వద్ద నిరసన చేశారు. అనంతరం జగనన్న కాలనీ లే అవుట్లను పరిశీలించి అక్కడ ప్రస్తుత పరిస్థితులను పలువురు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నెలకొన్న అసౌకర్యాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, 9వ వార్డు కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య, చెట్టుపల్లి నాయకులు చలపాక కృష్ణ, సామాల ప్రసాద్, గొలుగొండ మండల అధ్యక్షులు గండం దొరబాబు, సీనియర్ నాయకులు రేగుబళ్ల శివ, 'నాతవరం మండలం యూత్ అధ్యక్షులు బైన మురళి, లంక పాత్రుడు, వేగిశెట్టి శ్రీను, చెప్పా నానాజీ, నాతవరం మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడు పొన్న పోతురాజు, బాలేపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.










