Nov 13,2022 23:29

ఆందోళన చేపడుతున్న నాయకులు

జాశక్తి-రావికమతం:మండలంలో గుడ్డిప గ్రామంలో జగనన్న కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని జనసైనికులు ఆదివారం ఆందోళన చేపట్టారు. కాలనీలో రోడ్డు, నీటి సదుపాయం, విద్యుత్‌ సౌకర్యం లేదని జనసైనికుల వద్ద లబ్ధిదారులు వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు దేనికి సరిపోవని అన్ని సామగ్రి ధరలు విపరీతంగా పెరిగి పోయాయని వారికి తెలిపారు. ప్రభుత్వం ఇంటికి కనీసం మూడు లక్షలు అయినా మంజూరు చేయాలని వారు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఎటువంటి స్పందన లేదని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి నాగేశ్వరరావు, మజ్జి సాయికుమార్‌, గల్లా స్వామి, రమణ, సీత శేషు ,తదితరులు పాల్గొన్నారు.