జనసేన కార్యదర్శిని పరామర్శించిన హరి ప్రసాద్
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): ఇటీవల అధికార పార్టీ వారిచేత దాడికి గురైన పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి పంచాయతీకి చెందిన జనసేన మండల కార్యదర్శి మధుని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ సోమవారం పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే నిర్వహించిన గడప గడపకి కార్యక్రమంలో తమ ఇంటికి కేటాయించిన పత్రాలు చూపించి తన ఇల్లు కొంతమంది నాయకులు అమ్ముకున్నారని చెప్పడంతోనే తలపై 8 కుట్లు పడేలా కొట్టారన్నారు. మధు కుటుంబానికి అండగా ఉంటామన్నారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పోలీసులను కోరామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ రాందాస్ చౌదరి, లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, జీడీ నెల్లూరు ఇంచార్జ్ పొన్న యుగంధర్, పీలేరు ఇన్‌చార్జ్ దినేష్, జెంగాలా శివరాం, కార్యదర్శులు పసుపులేటి దిలీప్, ఆనంద్, రవి, యస్వంత్, రాఘవ, పుష్ప, హరీష్ రాయల్, నాగరాజు పాల్గొన్నారు.










