Sep 30,2023 23:16

జనసేన దెబ్బకు అధికారుల పరుగులు

జనసేన దెబ్బకు అధికారుల పరుగులు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: పట్టణంలోని ఏపీ సీడ్స్‌ సర్కిల్‌ వద్ద అధ్వాన రోడ్డుకు మర మ్మతులు చేయాలని జనసేన చేపట్టినవినూత్న నిరసన కు ఆర్‌అండ్‌బి అధికారులు స్పం దించారు. శనివారం గుంత ల్లో చిప్స్‌, మట్టిని నింపి మరమ్మ తులు చేశారు. 24 గంటల్లో సమస్య పై స్పందించిన అధికారులకు జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి వినుత ధన్యవాదాలు తెలిపారు.