Sep 02,2023 21:46

రక్తదానం చేస్తున్న జనసేన నాయకులు, కార్యకర్తలు

     పుట్టపర్తి క్రైమ్‌ : జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ జన్మదినం సందర్భంగా ఆ పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. శనివారం పట్టణంలోని హనుమాన్‌ సర్కిల్‌లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 42 మంది యువకులు రక్తదానం చేశారు. వద్ధాశ్రమం, ఆసుపత్రుల్లో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పవన్‌కళ్యాన్‌ రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు అబ్దుల్లా, పత్తి చంద్రశేఖర్‌, నియోజకవర్గ నాయకులు డాక్టర్‌ పల్లపు తిరుపతేంద్ర, పుట్టపర్తి, కొత్తచెరువు, నల్లమడ, ఒడిసి మండలాల కన్వీనర్లు తలారి పెద్దన్న, పూల శ్రీనివాసులు, మహేష్‌, ఈశ్వర్‌ పాల్గొన్నారు.