ప్రజాశక్తి- పార్వతీపురం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మంగళవారం పార్వతీపురం నియోజకవర్గ నాయకులు అక్కవరపు మోహన్ రావు సౌజన్యంతో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25 నుండి సెప్టెంబర్ 2వరకు జనసేన నేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా వారోత్సవాలు తమ పార్టీ తరఫున జరుపుతున్నామన్నారు. ఈ వారం రోజులు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం జరుపుతున్నామని, పవన్ కల్యాణ్ పుట్టినరోజున భారీ బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నామన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆగూరు మణి మాట్లాడుతూ రాజానబాలు, ఖాతా విశ్వేశ్వరావు, గుంట్రెడ్డి గౌరీశంకర్, అల్లు రమేష్, బొండపల్లి జనార్ధన, కర్రి మణికంఠ, చిట్లి గణేశ్వర రావు, పెద్దసంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










