Jul 10,2023 21:18

దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న వాలంటీర్లు


చెన్నూరు : జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ వాలం టీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం చెన్నూరు పాత బస్టాండ్‌ వద్దనున్న సచివా లయం-2 పరిధిలోని వాలంటీర్లు ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల ంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న తమపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాద ని వారన్నారు. కార్యక్రమంలో పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు.