Oct 19,2022 22:37

మాట్లాడుతున్న టిడిపి నేత అయ్యన్న పాత్రుడు

టిడిపి మాజీ మంత్రి అయ్యన్న పాత్రడు
ప్రజాశక్తి - ఆరిలోవ
: జనసేన నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం చట్టవిరుద్ధం, అప్రజాస్వామిక, దుర్మార్గమైన చర్య మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. . విశాఖ కేంద్రకారాగారంలో ఉన్న జనసేన నేతలను కలిసేందుకు బుధవారం మధ్యాహ్నం కేంద్రకారాగారానికి చేరుకున్నారు.అయితే జైల్‌లో ఉన్నవారిని కలిసేందుకు అనుమతించకపోవడంతో బయటే ఉండిపోయారు.
జైలులో ఉన్న జనసేన నేతలు బెయిల్‌పై బయటకు వస్తారని అప్పటికే అధిక సంఖ్యలో చేరుకున్న జనసేన నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన కాకుండా రాజారెడ్డి పాలన సాగుతోందన్నారు. పవన్‌కల్యాణ్‌ విశాఖ పర్యటనలో చోటుచేసుకున్న పరిణామాలు, జనసైనికులపై తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. అనేక సందర్భాల్లో పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరించడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా సిఎం జగన్‌రెడ్డి తీరుమార్చుకోకుంటే ప్రజలే తగిన బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. టిడిపి ముఖ్యనేత పట్టాభి, ఇతన నాయకులు పాల్గొన్నారు.