Oct 07,2023 00:03

జనరిక్‌ మెడికల్‌ షాపు ప్రారంభం


జనరిక్‌ మెడికల్‌ షాపు ప్రారంభం
ప్రజాశక్తి -కోట : కోట పట్టణంలోని గోపాల్‌ రెడ్డి విగ్రహం సమీపంలో నూత నంగా ఏర్పాటు చేసిన జనరిక్‌ మెడికల్‌ షాపును వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, కోట మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిఇగా విచ్చేసిన వినోద్‌ కుమార్‌ రెడ్డిని షావు యజమాని జోషి శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. షాపులోని మందులను, వసతులను వినోద్‌ కుమార్‌ రెడ్డి పరిశీలించారు. ధరలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి వినోద్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ కోట మండల ప్రజలకు, ముఖ్యంగా పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించేలా మందుల దుకాణం ఏర్పాటు చేయడం స్వాగతిం చాలన్నారు. కోట పట్టణం నడిబొడ్డున అందరికీ అందుబాటులో సామాన్య ధరలలో లభ్యమవుతున్నందున సద్వినియోగం చేసుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో కోట వార్డు మెంబరు పేర్నేటి కిరణ్‌ కుమార్‌, రాయపు పోలయ్య, పాల ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు.