Aug 07,2023 21:48

మహిళతో మాట్లాడుతున్నఆర్‌ఆర్‌

ప్రజాశక్తి-గాలివీడు
జనం బాగుండాలంటే ముఖ్యమంత్రి జగన్‌మో హన్‌రెడ్డిని సాగనంపాలని, రాష్ట్రంలో అరాచక పాలన అందిస్తున్న వైసిపి ప్రభు త్వానికి రోజులు దగ్గర పడ్డా యని నియో జకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అరవీడు పంచాయతీలో రాష్ట్ర భవిష్యత్తుకు చంద్ర బాబు గ్యారెంటీ , ఇదేంఖర్మ రాష్ట్రానికి కార ్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికలలో ఒక ఛాన్స్‌ అంటూ ప్రజలకు మాయ మాటలు చెప్పి జగన్‌ అధికారంలోకి వచ్చారని అన్నారు. నాలుగేళ్ల వైసిపి అరా చక పాలన ప్రజలకు అర్థమైపోందన్నారు. రాష్ట్రం మొత్తం సైకో పాలన సాగుతోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని తెలిపారు. ఈ ప్రభు త్వంలోఅన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురయ్యారని టిడిపి హయాంలోని ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కషి చేస్తుందని పేర్కొన్నారు. గత టిడిపి హయాంలో రైతాంగానికి వారి సంక్షేమానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ందన్నారు. తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కుటుం బంలోని విద్యార్థులందరికీ రూ.15 వేలు అందిం చడంతోపాటు, జిల్లా పరి ధిలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ.1500లు సంవత్స రానికి మూడు వంట సిలిండర్లు, రైతాంగానికి సంవత్స రానికి రూ.20వేలు, యువతకు నిరుద్యోగ భతి అందిం చడం జరుగు తుందని తెలిపారు. అనం తరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక విధా నాలను ప్రజల దష్టికి తీసుకు వెళ్లారు. కార్యక్ర మంలో నాయకులు మంద పాటి రవీంద్రబాబు, మాజీ ఎంపిపి వెంకటనారా యణరెడ్డి ,ఈశ్వర్‌ రెడ్డి, మాజీ మార్కెట్‌ వైస్‌ ఛైర్మన్‌ లక్షుమయ్య, మాజీ ఎంపిటిసి రమేష్‌ బాబు, సింగల్‌ విండో మాజీ ప్రెసిడెంట్‌ భాస్కర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ నాగయ్య , టిఎస్‌ మహబూబ్‌ బాషా గూడు సాహెబ్‌, సురేష్‌ తెలుగు జక్రియ, సుబ్బయ్య, సురేం ద్రరెడ్డి పాల్గొన్నారు. నందలూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమవుతుందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జంగంశెట్టి సుబ్బయ్య, బిసి సెల్‌ కార్య నిర్వాహక కార్యదర్శి చుక్క యానాదిలు పేర్కొన్నారు. చింతకాయలపల్లిలో టిడిపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగంశెట్టి సుబ్బయ్య, బిసి సెల్‌ కార్య నిర్వాహక కార్యదర్శి చుక్క యానాది మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్ల పాలనలో వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బోనబోయిన నరసయ్య మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి సుబ్బరాయుడు, నాయకులు జ్యోతి శివ, కొండయ్య , ప్రసాద్‌, రమణయ్య, నరసయ్య, శ్రీనివా సులు ,రాము యాదవ్‌, రామయ్య, తిరుపలయ్య, సుధాకర్‌, చంద్ర, భాస్కర్‌, శేఖర్‌, నాగేశ్వర్‌ నాయుడు, హరి ,కష్ణయ్య, వెంకటసుబ్బయ్య, నాగూర్‌ వెంకటయ్య, నాగి వెంకటసుబ్బయ్య, నాగి వెంకటరమణ, జి శివ పాల్గొన్నారు.