
ఎటిఎంలో నెమలి
తంబళ్లపల్లి : మండల కేంద్రానికి సమీపంలోని మల్లయ్య కొండ అటవీ ప్రాంతం నుంచి ఒక నెమలి మంగళవారం జన అరణ్యంలోకి వచ్చింది. రోడ్డుపై వెళ్తుంటే చూపరులు నెమలి చూడటానికి ఎగబడ్డారు. ఇండియన్ బ్యాంక్ ఎటిఎం కేంద్రంలోకి వెళ్ళింది. నెమలిని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. ఇంతలో భయానికి లోనైనా నెమలి పక్కనే ఉన్న వేపచెట్టు పైకి ఎగిరి అక్కడి నుంచి మల్లయ్య కొండ అటవీ ప్రాంతం వైపు వెళ్ళింది.