మంచి చెడులు బోధించే
విద్యాబుద్ధులు గరిపే
జ్ఞానదీపిక, మార్గదర్శి
క్షరము కాని అక్షరం
వెలకట్టలేని సంపదైన
అక్షరమే ఆయుధమైతే
న్యాయం స్వపక్షం,
అన్యాయం ఆమడదూరం.
అభివృద్ధికదే ఆలంబన,
సమాజహితానికదే సంజీవని.
అజ్ఞాన తిమిరాన్ని తరిమేసే
విజ్ఞాన సూర్యుడైన
''అక్షరం బాట''
అందరినీ పట్టిద్దాం
వారి జీవితాల్లో
''ఆనందజ్యోతులు'' నింపుదాం
దేశప్రగతికి
మనవంతు
చేయూత అందిద్దాం
వేమూరి శ్రీనివాస్
99121 28967