Jun 20,2023 21:20

గడపగడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

 రాయచోటి టౌన్‌ :జన సంక్షేమమే జగనన్న సంకల్పమని వైసిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని 21 సచివాలయ పరిధి 28 29 వార్డులలో గడప గడప కు మన ప్రభుత్వంను నిర్వహించారు. భట్టువీధి,శుక్రుమియా వీధి, రంగీన్‌ షా వలీ చౌషన్‌ దర్గా వీధులు, నాదాన వీధి, న్యూ సీమ హౌటల్‌ వీధి, ట్రంక్‌ రోడ్డు, మేదర వీధి లలో ఆయన తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలును వివరించారు. తొలుత బస్‌ స్టాండ్‌ సర్కిల్‌ లోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భట్టువీధి అభివద్ధిపై ప్రత్యేక దష్టి సారిస్తున్నామని చెప్పారు. గతంలో సరైన ప్రణాళికలు లేక ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో వీధులలో ఆటోలు సైతం వెళ్లలేని పరిస్థితులకు పరిష్కార మార్గాలకు కషి చేస్తున్నామన్నారు. ఇళ్లపైన విద్యుత్‌ లైన్లును తొలగించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రెయినేజీ, పారిశుధ్య మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హులందరికీ నారాయణరెడ్డిగారిపల్లె జగనన్న కాలనీలో పక్కా గహాలను మంజూరు చేయిస్తామన్నారు. దర్బార్‌ వలీ కుమార్తె షిఫా ఫర్వీన్‌ తాను ఇంటర్‌ రెండవ సంవత్సరం హెచ్‌ఇసి గ్రూపు చదువుచున్నానని, బుక్స్‌ కావాలని ఎమ్మెల్యేను వెంటనే పంపుతామనిచెప్పారు. భట్టువీధి, ట్రంక్‌ రోడ్‌ ,మేదర వీధులలోని ప్రజలు, దుకాణదారులు, చిరు వ్యాపారులతో శ్రీకాంత్‌ రెడ్డి మమేకమయ్యారు. వారి సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాష, వైస్‌ చైర్మన్‌ ఫయాజుర్‌ రెహమాన్‌, స్థానిక కౌన్సిలర్లు మెహె జబీన్‌, అన్నా సలీం, సాదిక్‌ అలీమదనపల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్‌, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్‌ ఖాన్‌,మున్సిపల్‌ కమీషనర్‌ గంగా ప్రసాద్‌, ఆసీఫ్‌ అలీ ఖాన్‌, కొలిమి ఛాన్‌ బాష, ఫయాజ్‌ అహమ్మద్‌, గౌస్‌ ఖాన్‌, అల్తాఫ్‌, రియాజ్‌, సుగవాసి ఈశ్వర్‌ ప్రసాద్‌, జానం రవీంద్ర యాదవ్‌, కో ఆప్షన్‌ అయ్యవారు రెడ్డి,హజరత్‌ ఖాదర్‌ వలీ, పార్టీ అధికార ప్రతినిధి విజయ భాస్కర్‌, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, మాజీ కౌన్సిలర్‌ ఆనంద రెడ్డి, రియాజుర్‌ రెహమాన్‌,మాజీ కో ఆప్షన్‌ జాఫర్‌ అలీ ఖాన్‌, సున్నా ఇర్షాద్‌, మూసా,సుప్రీం పైప్‌ ఫజులుల్‌ రెహమాన్‌,షిరిడీ సాయి మనోజ్‌ రెడ్డి, కొత్తపల్లె ఇంతియాజ్‌, నాదర్‌ బేగ్‌, జావీద్‌,అమీర్‌ పాల్గొన్నారు.