జన చైతన్య యాత్ర నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తలు
ప్రజాశక్తి-కొయ్యూరు
జనసేన పార్టీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంగులయ్య సూచనల మేరకు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు జన చైతన్య యాత్ర శనివారం కొయ్యూరులో జనసేన పార్టీ నాయకులు ప్రారంభించారు. నడింపాలెం, చింతలపూడి, గింజర్తి, నల్లగొండ గ్రామాల్లో కొనసాగించారు. ప్రతి గ్రామానికి వెళ్లి సమస్యలను తెలుసుకోనున్నట్లు చెప్పారు. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బుజ్జిబాబు, లక్ష్మణ్, రమేష్, రాజేష్ తదితరులు తెలిపారు.










