ప్రజాశక్తి - పాలకొండరూరల్ : జంతువుల పట్ల మానవత దృక్పధంతో మెలగాలని సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ అన్నారు. జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని అన్నారు. సబ్ కలెక్టర్ అధ్యక్షతన పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో జంతువుల పట్ల క్రూరత్వ నివారణపై మంగళవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ మాట్లాడు తూ జంతువులను అక్రమ రవాణా చేయడం చట్టవిరుద ్ధమని తెలిపారు. జంతు సంరక్షణ చట్టాల ద్వారా జంతువుల అక్రమ రవాణాను నిరోధించేలా కృషి చేయాలన్నారు. స్థానిక తహశీల్దార్ అధ్యక్షతన మండల స్థాయి ఎస్‌పిసిఎ (జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే సొసైటీ) కమిటీల ఏర్పాటు చేయాలన్నారు. జంతు సంక్షేమ సంస్థలు, స్థానిక అధికారులు జంతు జనన నియంత్రణ ( ఏ బి సి ) నమోదును జంతు జనన నియంత్రణ నియమాలు అనుగుణంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. అనుమతి లేని చికెన్, మటన్ విక్రయ కేంద్రాలను అధికారులు సందర్శించి ఆ కేంద్రాలను మూసివేసేలా చర్యలు తీసుకోవా లని పేర్కొన్నారు. జంతువుల రవాణా కోసం ఉపయోగించే వాహనాల్లో జిపిఎస్ ట్రాకర్‌ను పరిశీలించాలన్నారు. స్కూల్లో వ్యాసరచన, వక్తత్వ పోటీలు నిర్వహించడం వల్ల జంతువుల పట్ల పిల్లలకు అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. కేదారపురం వద్ద అక్రమ పశువుల బేస్ క్యాంపుల పరిశీలిం చాలన్నారు. గ్రామాల్లో కోళ్ల, మేకలు,గొర్రెల పందాలను అరికట్టేందుకు తోడ్పడాలి తెలిపారు. కార్యాక్రమంలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.మాణిక్యరావు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ బి.సిద్దార్థ, డిఎల్‌పిఒ జె.రామప్రసాదరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్.సర్వేశ్వరరావు, ఎస్‌ఐ బి.శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.










