Sep 13,2023 21:54

ప్రతిభ చాటిన విద్యార్థులు

'జంప్‌ రోప్‌' లో మంగళం ట్రెండ్స్‌ విద్యార్థుల ప్రతిభ
అభినందనలు తెలిపిన టీచర్లు
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో ఎంపికైన విద్యార్థులు గుంటూరు జిల్లా తెనాలిలోని ఏఎస్‌ఆర్‌ స్టేడియంలో ఈ నెల 9, 10వ తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి జంప్‌ రోల్‌ పోటీలలో మంగళం పరిధిలోని మంగళం పంచాయతీలో గల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (మంగళం ట్రెండ్స్‌) విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ఏడు పతకాలు సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి. కేశవులు నాయుడు తెలిపారు. పాఠశాలల్లోని 9, 10వ తరగతి విద్యార్థులు ఈ పోటీలకు వెళ్లారన్నారు. రమ్యశ్రీ బంగారు పతకం, మధుమిత బంగారు పతకం, సంజన రెడ్డి వెండి పతకం, కావ్య వెండి పతకం, జాహ్నవి కాంస్య పథకం, అభిశ్రీ కాంస్య పతకం, సాయిధరమ్‌ తేజ్‌ కాంస్య పథకాలు సాధించారన్నారు. వీరందరూ వచ్చే నెలలో నిర్వహించే జాతీయస్థాయి జంప్‌ రోప్‌ పోటీలకు ఎంపికైనట్లు తెలుపారు. జాతీయస్థాయిలో కూడా విజయం సాధించాలని పాఠశాల పిడి రామకష్ణ, సాంబశివరావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ జి.సుశీల తెలిపారు.
ప్రతిభ చాటిన విద్యార్థులు