Sep 14,2023 22:05

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
          విఆర్‌కు వెళ్లిన జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ సాగర్‌బాబును ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జంగారెడ్డిగూడెంలో ఎస్‌ఐగా సాగర్‌బాబు విధుల్లో ఉన్న సమయంలో పట్టణంలోని ఓ పాఠశాల భవన వివాదం, పలు కేసుల నమోదులో అలసత్వం వహించారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఇటీవల ఎస్‌ఐను విఆర్‌కు పంపారు. అలాగే ఆయన గతంలో పనిచేసిన చోట ఉన్న ఆరోపణలపై కూడా దృష్టిసారించిన పోలీసు ఉన్నతాధికారులు విఆర్‌కు పంపిన సాగర్‌బాబును సస్పెండ్‌ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై స్థానిక పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.