
ప్రజాశక్తి-గణపవరం : మండలంలో జల్లికాకినాడ పంచాయతిలో గ్రామప్రజలకి మంచి నీటికుళాయలు ఏర్పాటు విషయంలో గతపాలకవర్గం అవినీతికి పాల్పడినట్లు గ్రామసర్పంచి బాతు నాగేశ్వరావు జిల్లా పంచాయతీ అదికారి రమేష్ బాబు పిర్యాదు చేసినట్లు గురువారం చెప్పారు. అవినీతి పైవిచారణ జరపాలని కోరారు. దీంతో డిపిఒ రమేష్ బాబు డిల్.పిఒని విచారణ జరపాలని ఆదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమములో అంబేద్కర్ ఇండియన్ మిషన్ జిల్లా కార్యదర్శి ఆనంద్, సహయకార్యదర్సి రత్నం, గణపవరం మండల కార్యదర్శి ఆశోక, హరికృష్ణ, డిఎన్.రాజు పాల్గొన్నారు.