Oct 07,2023 21:31

ప్రజాశక్తి - కామవరపుకోట
   కామవరపు కోట ఎండిఒ ఆఫీస్‌లో సాయంత్రం 3 గంటల నుంచి వైఎస్‌ఆర్‌ జలకళ మోటార్‌ కిట్లు పంపిణీ చేశారు. వైఎస్‌ఆర్‌ జలకళ పథకంలో సబ్సిడీపై డెక్కన్‌ మోటార్‌ 10 హెచ్‌పి, 300 అడుగుల వెళ్లే 2 అంగుళాల ట్యూబ్‌, కరెంట్‌ సర్వీస్‌ వైర్‌, డెక్కన్‌ స్టార్ట్‌ బాక్స్‌, ఇతర వస్తువులు పంపిణీ చేశారు. ఇందులో కళ్లచెరువు, కామవరపు కోట, సాగిపాడు, తడికలపూడి, వీరిశెట్టి గూడెం ఈస్ట్‌ యడవల్లి, రామన్నపాలెం రైతులు ఈ కిట్లు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ పురుషోత్తం, టెక్నికల్‌ అసిస్టెంట్‌ గంగాథరరావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.