Aug 30,2023 22:49

ప్రజాశక్తి - మేదరమెట్ల
జలజీవన్ పథకంలో భాగంగా మండలంలోని రావినూతలలో రూ.50.85లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఇంటింటికి కులాయి పథకానికి అద్దంకి నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ బాచిన కృష్ణ చైతన్య బుధవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సాదినేని ప్రసన్నకుమారి, కన్వీనర్ సాదినేని మస్తాన్రావు, సర్పంచ్ విజయ వాణీ, ఎంపీడీవో డి సురేష్ బాబు, రామినేని వెంకటరమణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.