జలజీవన్ నిధుల ద్వారా ఇంటింట కుళాయి
జలజీవన్ నిధుల ద్వారా ఇంటింట కుళాయి
ప్రజాశక్తి - ముసునూరు
లోపూడి శివారు బస్సావరప్పాడు గ్రామంలో రూ.27,70,000లు జలజీవన్ నిధుల ద్వారా ఇంటింటి కుళాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు లోపూడి సర్పంచి పేరం కృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని బస్సావరప్పాడు గ్రామంలో గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ జలజీవన్ మిషన్ గ్రాంట్లు ద్వారా రూ.1.80 కి మీటరు పైపులైను, కుళాయిలకు రూ.81,600లు, బోరు, మోటారు నిర్మాణంకై రూ.4,91,619లు, ట్యాంకు నిర్మాణం రూ.6,00,000లు మొత్తం రూ.27,70,000లు జలజీవన్ మిషన్ ద్వారా నిధులు మంజూరైనట్లు ప్రాజెక్టు సూపర్ వైజరు శ్రీనివాస్, మండల ఎపిఎం కె.బాబులు తెలియజేశారు.










