Nov 16,2022 23:10

సమస్యలతో కూడిన వినతిపత్రం ఇస్తున్న ప్రశాంత్‌, శివకృష్ణ

గ్రామసభలో ప్రశ్నించిన వార్డు సభ్యుడు, ప్రజలు
ప్రజాశక్తి -ఆనందపురం:
జల జీవన్‌ మిషన్‌ పథకం కింద నిధులు మంజూరైనా ఇంకా పనులెందుకు ప్రారంభించలేదని గొట్టిపల్లి పంచాయతీ వెంకటాపురం గ్రామస్తులు, వార్డు సభ్యుడు తాడివాడ ప్రశాంత్‌, శివకృష్ణ పంచాయతీ అధికారులను నిలదీశారు. బుధవారం గొట్టిపల్లిలో నిర్వహించిన గ్రామసభలో శివకృష్ణ మాట్లాడుతూ జల జీవన్‌ మిషన్‌ పథకం కింద వెంకటాపురం గ్రామానికి రూ.16 లక్షలు, చీమల వెంకటాపురం గ్రామానికి రూ.14 లక్షలు నిధులు మంజూరైనా నేటికీ పనులు చేపట్టలేదని, దీనిపై వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. పంచాయతీ పరిధిలో రోడ్లు డ్రైనేజీలు, వీధి దీపాలు, శ్మశానవాటికకు రోడ్డు, అపారిశుధ్యం ఇతరత్రా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని, వీటిల్లో ఏ ఒక్కటీ పరిష్కరించడం లేదన్నారు. తక్షణమే స్పందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని గ్రామ కార్యదర్శి సురేష్‌, సర్పంచ్‌ గంటా జగదీష్‌కు అందజేశారు