Aug 28,2023 00:27

మాట్లాడుతున్న రామా నాయుడు

ప్రజాశక్తి-మాడుగుల:పెండింగ్‌ జలాశయాలు పూర్తి చేసి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు డిమాండ్‌ చేశారు. ఆదివారం మాడుగులలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. తాచేరు, గొర్రె గెడ్డ, పెద్దేరు ఎడమ కాలువల కోసం తాము నిధులు మంజూరు చేస్తే, ప్రభుత్వం పనులు చేపట్టలేదన్నారు. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు ఏనాడూ రైతు సమస్యల ప్రస్తావన తీసుకు రాలేదని విమర్శించారు. ఇసుక మాఫియా పెరిగిందని, రహదారుల పరిస్థితి అధ్వానంగా వుందని అన్నారు .రైతుల సమస్యలు పక్కన పెట్టి దోపిడీలకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. తాచేరు జలాశయం కోసం ఈనెల 29, 30 తేదీలలో మండలంలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాద యాత్ర చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుప్పాల అప్పలరాజు, మజ్జి తాత బాబు,అప్పాన రమణ, పుప్పాల రమేష్‌, గొల్లవిల్లి శ్రీరామమూర్తి, పుప్పాల రమేష్‌, లెక్కల కాశి బాబు, సూర్యనారాయణ రాజు, బుద్దాల రమణ తదితరులు పాల్గొన్నారు.