Nov 03,2023 22:40

జక్కా వెంకయ్యకు ఘన నివాళి

జక్కా వెంకయ్యకు ఘన నివాళి
ప్రజాశక్తి - గూడూరు టౌన్‌
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పక్షపాతి జక్కా వెంకయ్య అని సీపీఎం పార్టీ సెంట్రల్‌ కార్యదర్శి జోగి శివకుమార్‌ పేర్కొన్నారు. జక్కా వెంకయ్య 93 వ జయంతి సందర్భంగా శుక్రవారం గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సీనియర్‌ నాయకులు బుడతాటి చంద్రయ్య అధ్వర్యంలో జక్కా వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జోగి శివకుమార్‌ మాట్లాడుతూ పేదల కోసం ఏడు దశాబ్దాలు అలుపెరగని పోరాటాలు చేసిన యోధుడు అని కొనియాడారు. ఆయన తుది శ్వాస వరకు బడుగు , బలహీన వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించారు అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు అధ్యక్షులు బి.వి.రమణయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి యస్‌.సురేష్‌, పామంజి మణి, కె.వి.పి.ఎస్‌ పట్టణ నాయకులు అడపాల ప్రసాద్‌ ,బాలరాజు పాల్గొన్నారు.