జియో సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలి
ప్రజాశక్తి - నందికొట్కూరు
నందికొట్కూరులోని ఐదో వార్డ్ పరిధిలో సత్యనారాయణ టెంపుల్ మధ్యలో నిర్మిస్తున్న జియో సెల్ టవర్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని కాలనీ వాసులతో కలిసి సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ పి కిషోర్, తహశీల్దార్ రాజశేఖర్ బాబులకు జై కిసాన్ పార్కులో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు ఎం నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణంలో పేదలు నివసించే చోట సెల్ టవర్ బిగించడం వలన రేడియేషన్ వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. గతంలో సెల్ టవర్లతో అనేక చోట్ల అనేక వ్యాధులు వచ్చి చనిపోవడం జరిగిందన్నారు. తక్షణమే టవర్ నిర్మాణాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ కిషోర్ మాట్లాడుతూ తక్షణమే రద్దు చేస్తామని ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకుడు కే భాస్కర్ రెడ్డి, టౌన్ కార్యదర్శి గోపాలకృష్ణ, సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు వి ఆంజనేయులు, సి నాగన్న, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.










