Sep 13,2022 22:19

రేఖవానిపాలెంలో విద్యార్థులతో డిఇఒ చంద్రకళ

ప్రజాశక్తి -భీమునిపట్నం : భీమిలి పరిధిలోని పలు జివిఎంసి పాఠశాలలను జిల్లా విద్యా శాఖాధికారి ఎల్‌.చంద్రకళ మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గంటస్తంభం సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాలను, ఉపాధ్యాయుల బోధనా తీరును పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలను పరిశీలించి, వారి సామర్థ్య స్థాయి తక్కువగా ఉండడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. రేఖవానిపాలెం జివిఎంసి ఉన్నత పాఠశాలను, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ప్రాథమిక విద్యార్థుల అభ్యసన స్థాయిలను పరిశీలించారు. విద్యార్థులు సమాధానం చెప్పే తీరుపై సంతప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌ బి.శ్రీనివాసరావు, జిల్లా విద్యా శిక్షణా సంస్థ ప్రిన్సిపల్‌ యు.మాణిక్యంనాయుడు, అసిస్టెంట్‌ అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి లక్ష్మి, ఎంఇఒ కెఎ.బాలామణి తదితరులు ఉన్నారు.