Sep 29,2023 20:54

జిపిఎస్‌తో ఉద్యోగస్తులకు మోసం : ఫ్యాప్టో

బి.కొత్తకోట : జిపిఎస్‌ను వ్యతిరేకిస్తూ పట్టణంలోని ఎంఆర్‌సి కార్యాలయం ఎదుట శుక్రవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ సిపిఎస్‌ అనేది పెనుము మీద కాలుతుంటే జిపిఎస్‌ అనే పొయ్యిలోకి ఉద్యోగస్తులను ప్రభుత్వం నెట్టుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్‌ రెడ్డి భాస్కర్‌రెడ్డి, యుటిఎఫ్‌ మండల అధబి.కొత్తకోట : ఎంఆర్‌సి కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న ఫ్యాప్టో నాయకల్యుక్షులు నీలేష్‌,ఉపాధ్యాయులు విశ్వనాథరెడ్డి,శైలజ,సుజాత వెంకటరమణారెడ్డి, గిరీష్‌, గోవిందరెడ్డి, సోమశేఖర్‌, ప్రభాకర్‌, రెడ్డిప్రసాద్‌, రామాంజులు, నాగరాజు, శంకరలు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు ఉద్యోగస్తులకు తమ ప్రభుత్వం వస్తే వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేస్తానని నాలుగు సంవత్సరాల తర్వాత అసెంబ్లీలో జిపిఎస్‌ తీసుకొచ్చి ఉద్యోగస్తుల్ని నిట్టనిలువునా మోసం చేశారని సిఐటియు జిల్లా అధ్యక్షులు, సి.హెచ్‌ చంద్రశేఖర్‌, చిట్వేలి రవికుమార్‌ విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రిటైర్మెంట్‌ తర్వాత ఇచ్చే పింఛన్‌, కాంట్రిబ్యూటీ పెన్షన్‌ వల్ల దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగుల నష్టపోతారని తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌ ఒపిసి అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని శాసనసభలో ప్రకటించడం అన్యాయమన్నారు. శాసనసభలో ప్రతిపక్షం లేకపోవడంతో ఏకపక్షంగా మూజవాని ఓటుతో జిపిఎస్‌కు ఆమోదం తెలి పారని అన్నారు. శాసన మండలిలో సిపిఎం తరపున పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకోవడం జరిగిందన్నారు. అయినా ముఖ్యమంత్రి హామీన అమలు చేయకుండా, ఏకపక్షంగా ఆమోదించడం శోచనీయమన్నారు.