
ప్రజాశక్తి - బాపట్ల
జిపిఎస్ విధానం వల్ల సిపిఎస్ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని
ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మ డి గుంటూరు జిల్లా అధ్యక్షురాలు ఎస్ కల్పన అన్నారు. ఎపి సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బాపట్ల జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగుల అశలను ఆడి అయాశలు చేస్తూ జిపిఎస్ చట్టం అమలకు గేజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమని అన్నారు. రాష్ట్ర ఎన్నికల పరిశీలికులు బాజీ పటాన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దుచేస్తానని ఇచ్చిన హామీని విస్మరించారని అన్నారు. ఈ సందర్భంగా ఎపి సిపిఎస్ఈఎ బాపట్ల జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. జిల్లా గౌరవాధ్యక్షులు ఎం జోష్ బాబు, జిల్లా అధ్యక్షులు గుర్రం మురళీమోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నూతలపాటి మార్క్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఎ జాకబ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎ శ్రీనివాసరావు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి ఎం వీరరాఘవ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిలర్లు బాజీ పఠాన్, కె పార్థసారథి, డి నాగేశ్వరరావు, పి నాగేశ్వరరావు, జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అజయ్ ఫణి శర్మ నియమితులయ్యారు.