ఉంగుటూరు:జిపిఎస్‌ను వ్యతిరేకిస్తూ, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ మండలంలోని నారాయణపురం హైస్కూల్ ఉపాధ్యాయులు ఫ్యాప్టో పిలుపుమేరకు యుటిఎఫ్ నేత వునుముల రాంబాబు, ప్రధానోపాధ్యాయులు షేక్ మీరాసాహెబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ సిపిఎస్, జిఎస్ ఉద్యోగులకు సమ్మతం కాదని ఒపిఎస్ మేలు అని అన్నారు. సిఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.










