
జిపిఎస్‌ను ఉపసంహరించుకోవాలి : యుటిఎఫ్
ప్రజాశక్తి - ప్యాపిలి
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని జిపిఎస్ విధానం అమలుని ఉపసంహరించుకోవాలని యుటిఎఫ్ ప్యాపిలి మండల జిల్లా కౌన్సిలర్ శేషయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు మండల పరిధిలోని రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, పిఆర్ పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పాత పెన్షన్ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నల్ల రిబ్బన్ ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లా డుతూ అనేక రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చర్యలు తీసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనక్కు వెళ్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాత పెన్షన్ విధానం పున రుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపా ధ్యాయులు ఉమా దేవి,ఉపాధ్యాయులు లక్ష్మా నాయక్,మహేశ్వరమ్మ,విజయ లక్ష్మీ, ఫర్జానా,రుక్మిణి,జయతులసమ్మ,మమత తదితరులు పాల్గొన్నారు.