Sep 24,2023 21:21

మదనపపల్లెలో బైక్‌ జాతా నిర్వహిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

మదనపల్లె అర్బన్‌: జిపిఎస్‌ను ఎట్టి పరిస్థితిలో అంగీకరించమని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు, ప్యాప్టో రాష్ట్ర చైర్మన్‌ నక్కా వెంకటేశ్వర్లు అన్నారు. యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా అనంతపురం నుంచి బయలుదేరిన యూటిఎఫ్‌ రాష్ట్ర జాత కడప, రాయచోటి పీలేరు మీదుగా ఆదివారం మదనపల్లికి చేరుకుంది. స్థానిక యుటిఎఫ్‌ నాయకులు వారికి ఘన స్వాగతం పలుకుతూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం యుటిఎఫ్‌ కార్యాల యం వద్ద సీనియర్‌ నాయకులూ ఉత్తన్నచే జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ కనుగుణంగా సిపిఎస్‌ రద్దు చేయకుండా దాని స్థానంలో జిపిఎస్‌ తీసుకొచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయులకు భవిష్యత్‌కు గ్యారంటీ లేకుండా చేస్తున్నారని వాపోయారు. హామీ ఇవ్వని రాష్ట్రాలు చతిఘడ్‌, రాజస్థాన్‌, వెస్ట్‌ బెంగాల్‌ వంటి ఆరు రాష్ట్రాలు ఎన్నికల ముందు హామీ ఇవ్వకపోయినా సిపిఎస్‌ ని రద్దు చేసి ఒపిఎస్‌ను అమలు చేశాయని చెప్పారు. మన రాష్ట్రంలో ఎన్నికల ముందు పాదయాత్రలో సిపిఎస్‌ను కచ్చితంగా రద్దు చేస్తామని పదేపదే హామీ ఇచ్చినా నేటి ముఖ్యమంత్రి జగన్‌ ఆ విషయాన్ని విస్మరించి జిపిఎస్‌ తీసుకురావడం ఉద్యోగులను మోసం చేయడమేనని వాపోయారు. బిజెపి పాలిత రాష్ట్రాలు ఏ ఒక్కటీ నూతన విద్యా విధానాన్ని అమలు చేయకపోగా రాష్ట్రంలో అగ మేఘాల మీద అమలు చేయడంతో లక్షలాది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రయివేట్‌కు తరలి వెళ్లారని తెలిపారు. ఈ విధానంతో ప్రాథమిక విద్య ప్రమాదంలో పడిందని, ఈ ప్రభుత్వం ఏర్పడి నప్పటీ నుంచి ఒక్క డిఎస్‌సి కూడా విడుదల చేయక పోవడంతో వేలాది నిరుద్యోగులు తీవ్ర వేదనలో ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా నాయకులు హరిప్రసాద్‌, జాబీర్‌, రవి ప్రకాష్‌ , హేమలత, పురం వెంకటరమణ, సుధాకర్‌ నాయుడు, భాస్కర్‌ రెడ్డి, డివిజన్‌ నాయకులు సుధాకర్‌, శ్రీనివాసులు, అంజాద్‌, నర్సిహం, హరి , సీనప్ప, పయని, రవీంద్ర, విజరు, హస్సన్‌ , మునిరాజ, భానుమూర్తి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాజంపేట అర్బన్‌ : యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ ప్రారంభ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. విశ్రాంత ఉపాధ్యాయులు ప్రతాప్‌, నరసింహారాజు, సుబ్బ నరసయ్య, ఎల్లయ్య, ప్రధానోపాధ్యాయులు గోపాలకష్ణ తిరుపతి రోడ్డు లోపల విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద యుటిఎఫ్‌ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ చంగల్‌ రాజు, సిఐటియు జిల్లా నాయకులు రవికుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. యుటిఎఫ్‌ విద్యారంగ వికాసం, ఉపాధ్యాయుల సంక్షేమానికి ఎన్నో ఉద్యమాలు చేపట్టిందని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతోపాటు విద్యార్థుల హక్కులు, వారి చదువు కోసం నిరంతర పోరాటాలతో యుటిఎఫ్‌ అగ్రభాగాన నిలిచిందని అన్నారు. జాతీయ విద్యా విధానం రద్దు, పాత పెన్షన్‌ సాధన, రాష్ట్రంలో విద్యారంగ సంస్కరణలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు రూపొందించుకొని పోరాటాలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం స్వర్ణోత్సవ వేడుకల గోడపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎఫ్‌ నాయకులు వెంకట సుబ్బయ్య, నాగేంద్ర, కవలకుంట్ల పాపయ్య, శ్రీనివా సులు, రమేష్‌, హరినాథ్‌, నరసింహారావు, వినోద్‌ కుమార్‌, సుధాకర్‌, సతీష్‌, నాగూర్‌ రవి, కష్ణా నందం, శివయ్య, రామకష్ణ, రవిచంద్ర, కిషోర్‌ పాల్గొన్నారు.