తహశీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న ఉద్యోగులు
ప్రజాశక్తి - తెనాలి : ఉద్యోగులకు ఎన్నికల్లో వైసిపి హామీ ఇచ్చిన ప్రకారం సిపిఎస్ రద్దు చేయాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్.కల్పన డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. కల్పన మాట్లాడుతూ ప్రభుత్వం జిపిఎస్ అంటూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తోందని, దీంతో ఉద్యోగులకు నష్టమే తప్ప ప్రయోజనం లేదని అన్నారు. తక్షణమే సిపిఎస్ రద్దుచేసి, జిపిఎస్ ప్రయత్నం విరమించుకొని, ఒపిఎస్‌ను అమలు చేయాలని కోరారు. అనంతరం తహశీల్దార్ కె.రవిబాబుకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ హెనిప్రియ, సీనియర్ అసిస్టెంట్ జగన్ మోహన్‌రావు, ఎస్‌ఆర్వో సీత పాల్గొన్నారు.










