Oct 12,2023 23:06

ప్రజాశక్తి-మండపేట
జిపిఎస్‌, సిపిఎస్‌ని రద్దు కోరుతూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో పోస్ట్‌కార్డు ఉద్యమం స్థానిక ఎస్‌ఎస్‌వివి హైస్కూల్‌ నందు గురువారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా సిపిఎస్‌ కమిటి కన్వీనర్‌ ప్రదీప్‌ కుమార్‌, జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. రవికుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి బసు, మాట్లాడుతూ అధికారంలోకి రాక ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సిఎం జగన్‌ సిపిఎస్‌ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పరన్నారు. జిపిఎస్‌ రద్దు కోసం రాష్ట్ర, తాలూకా, మండల కేంద్రాల్లో దశలవారి పోరాటం చేస్తామన్నారు. సిపిఎస్‌ రద్దుచేసి జిపిఎస్‌ ను ప్రభుత్వం హడావుడిగా తెరమీదకు తీసుకొచ్చి ందన్నారు. దీంతో ఉద్యోగుల, ఉపాధ్యాయుల పరిస్థితి పెనం మీద నుంచి పోయిలో పడినట్లు అయిం దన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు కొవ్వూరి గోపాలకష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌, పి.సురేంద్ర కుమార్‌, రాయుడు శ్రీనివాస్‌, కె.సత్తిబాబు, కె.రామచంద్రరెడ్డి, త్రినాథ్‌ తాడి శ్రీని వాస్‌, పి సూరిబాబు,జి.రాజు తదితరులు పాల్గొన్నారు.