
ప్రజాశక్తి మచిలీపట్నం రూరల్ : సిపిఎస్, జీపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్సన్ విధానాన్ని అమలుచేయాలని కోరుతూ శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద సాయంత్రం ఫాఫ్టో ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా యు టి ఎఫ్ కష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి జె లెనిన్ బాబు, యు టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె ఏ ఉమా మహేశ్వరరావులు మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీ పి ఎస్ ను రద్దు చేస్తామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీనిమరచి, నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు జి పీ ఎస్ అనే కొత్త విధానాన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా బలవంతంగా ప్రభుత్వం ప్రతిపాదించడం, కేబినేట్ ఆమోదం తెలపడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను మోసం చేయడమేనని అన్నారు. మద్దతునిచ్చే అన్ని సంఘాలు భాగస్వామ్యంతో సోమవారం అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు జయప్రదం చేయాలన్నారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ వనజాక్షి కి ఈ సమస్యను ప్రభుత్వం దష్టికి తీసుకు వెళ్లాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఫాఫ్టో జిల్లా కోశాధికారి ఏఆర్ ఆస్లాం, బివి మల్లిఖార్జున, టి గంగరాజు, టి నాగేశ్వరరావు, వెంకయ్య, ఎస్ టి యూ కిరణ్,జె ఈ ఝాన్సీ లక్ష్మి, ఏపిటిఎఫ్ సూరిబాబు అధిక సంఖ్య లో ఉపాధ్యాయులు ఫోల్గొన్నారు.