
ప్రజాశక్తి-నందిగామ: నందిగామలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జిపిఎస్ చట్టం ప్రతులను దహనం చేశారు. యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి మహేశ్వర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం తన ఎన్నికల హామీ నుండి, మేనిఫెస్టోని దైవము లాంటిదని ,బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది అని చెప్పి, తను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరిస్తానని ఇచ్చిన హమీలు తుంగలోకి తొక్కారన్నారు. ఉద్యోగులు ,ఉపాధ్యాయులకు పెన్షనర్లు ,నిరుద్యోగుల ఓట్లను పొంది అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఉద్యోగులకి గొడ్డలి పెంటు లాంటి జిపిఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకురావటం హేయమైన చర్య అన్నారు. దానికి బుధవారం శాసనసభలో చట్టం చేయటం, ఉద్యోగులను ఉపాధ్యాయులను సమాజాన్ని మభ్యపెట్టడమేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సహాధ్యక్షులు ఎం.కృష్ణయ్య , రాష్ట్ర కౌన్సిలర్ పిఎస్ హరినాథ్‌రెడ్డి, చిన్న నర్సరావు, ఎలమందయ్య , వెంకటాద్రి గంగరాజు, బిట్టు సత్యనారాయణ, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.