
ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : ఏపీ అసెంబ్లీలో సెప్టెంబర్ 27న జిపిఎస్ బిల్లు ఆమోదం దుర్మార్గమని యుటిఎఫ్ నాయకులు అన్నారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం సిపిఎస్ విధానమును రద్దు చేసి పాత పెన్షన్ విధానమును ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌తో యుటిఎఫ్ 2004 నుంచి నేటి వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక పోరాటాలు జరిపిందన్నారు. అయితే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఏ ఉద్యోగి ఉపాధ్యాయుడు డిమాండ్ చేయకనే జిపిఎస్‌ను ప్రవేశపెట్టడాన్ని యూటీఎఫ్ సత్యసాయి జిల్లా శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. భవిష్యత్తులో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని పాత పెన్షన్ విధానం కొరకు ఉద్యమిస్తామని తెలిపారు. యుటిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు భూతన్న, సహాధ్యక్షులు బాబు సీతామహాలక్ష్మి, కోశాధికారి శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్ మారుతి శ్రీనివాసులు జిల్లా కార్యదర్శులు నారాయణస్వామి తాహిర్ వలి, హరికృష్ణ, రమీజా, శివశంకర్ తదితరులు జిపిఎస్ ఆమోదాన్ని ఖండించారు.
పెనుకొండ : శాసనసభలో జిపిఎస్ బిల్లు ఆమోదం తెలపడాన్ని పట్ల యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ లో బుధవారం శాసన సభలో ఆమోదించిన జిపిఎస్ జీవో ప్రతులను యుటిఎఫ్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సుధాకర్ మాట్లాడుతూ జిపిఎస్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. భవిష్యత్తులో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని పాత పెన్షన్ విధానం కొరకు యు టి ఎఫ్ ఉద్యమిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, నాయకులు రమేష్, రవీంద్రనాథ్, నరసింహులు, ఆదిజినేష్, రామాంజినేయులు, నాగార్జున రెడ్డి,జె.నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : జీపీఎస్ బిల్లును ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిరసన చేపట్టారు. ఈ మేరకు స్థానిక కాలేజ్ సర్కిల్ లో జీపీఎస్ బిల్లు జీవో ప్రతులను దగ్ధం చేసి అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ పాతపెన్సన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా బుధవారం అసెంబ్లీలో జీపీఎస్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. భవిష్యత్తులో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం జోన్ యూటీఎఫ్ నాయకులు రామకృష్ణనాయక్, ఆంజనేయులు, గోపాల్‌రెడ్డి, రాంప్రసాద్, సకలచంద్రశేఖర్, గడ్డంరామ్మోహన్, కావ్యకీర్తి విజయరాణి. నాగేంద్ర, నాగేశ్వరరెడ్డి, శివారెడ్డి, శేషు, రమేశ్, చంద్రలు పాల్గొన్నారు.
మడకశిర : జిపిఎస్ ప్రతులను యుటిఎఫ్ నాయకులు దగ్ధం చేశారు. పట్టణము లోని వైఎస్‌ఆర్ సర్కిల్‌లో నిర్వహిచంఇన ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు కే. భూతన్న, సిపిఐ నాయకురాలు పవిత్ర, మండల యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.ఎన్. మాలింగప్ప, .మూడ్లగిరియప్ప, వై. జోగప్ప తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : జిపిఎస్ కాదని ఒపిఎస్‌ను అమలు చేయాలని ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకులు డి శ్రీనివాసులు డిమాండ్ చేశారు .ఈ మేరకు జిపిఎస్ బిల్లును ఆమోదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ , ఉపాధ్యాయులు సంక్షేమం గురించి ఆలోచించకుండా నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ , ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వైవి సుబ్బారెడ్డి, మల్లికార్జున, ఖాజా మోహిద్దీన్, జి ఆనంద్, రవివర్ధన్ రెడ్డి, వెంకటరమణ నాయక్ , నజీరుల్లా తదితరులు పాల్గొన్నారు.